NZB: జిల్లాను ఉదయం దట్టమైన పొగమంచు దుప్పటిలా కమ్మేసింది. ఉదయం 7 గంటలైనా మంచు తీవ్రత తగ్గకపోవడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు, ముందున్న మనుషులు సైతం కనిపించకపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తెల్లవారుజామున వాకింగ్‌కు వెళ్లేవారు సైతం అవస్థలు పడ్డారు.
తెలంగాణ
జిల్లాను కమ్మేసిన దట్టమైన పొగమంచు


