హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంచు దుప్పటిలో సూర్యాపేట జిల్లా

SRPT: జిల్లా వ్యాప్తంగా బుధవారం తెల్లవారుజామున మంచు కురవడంతో పలు ప్రాంతాలు మంచు దుప్పటిని తలపించాయి. దట్టమైన పొగమంచు కారణంగా రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చలి తీవ్రత పెరగడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ఇబ్బంది పడ్డారు. వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.