హైదరాబాద్: 28°C
తెలంగాణ

ములుగులో చెత్త డంపింగ్‌కు స్థలం కరువు!

ములుగు మున్సిపాలిటీలో చెత్త డంపింగ్‌ సమస్య తీవ్రంగా మారింది. శాశ్వత డంపింగ్‌ యార్డు లేకపోవడంతో పలు ప్రాంతాల్లో వ్యర్థాలను పారబోస్తున్నారు. పట్టణంలో రోజుకు ఏడు టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. మదనపల్లి శివారులో ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని రెండు నెలల క్రితం కలెక్టర్‌కు లేఖ రాసినా స్పందన లేదు. అధికారులు వెంటనే స్థలం కేటాయించాలని పురపాలక అధికారులు కోరుతున్నారు.