హైదరాబాద్: 28°C
తెలంగాణ

చరిత్రలోనే తొలిసారి.. ప్రధాన ద్వారం మూసివేత

JGL: కొండగట్టు ఆలయ చరిత్రలోనే తొలిసారి మధ్యంతరంగా ప్రధాన ద్వారం మూసివేశారు. నిజరూప దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని తెలిసినా ముందస్తు చర్యలు లేవని భక్తులు విమర్శిస్తున్నారు. గంటల తరబడి వేచి ఉన్న భక్తులు ఓపిక నశించి బారికేడ్లను తోసి ఆలయంలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. పరిస్థితి చేయి దాటడంతో అధికారులు ద్వారాన్ని మూసివేశారు. రద్దీ నియంత్రణలో యంత్రాంగం విఫలమైందని భక్తులు ఆరోపిస్తున్నారు.