W.G: కాళ్ల మండలం పాతాళ్లమెరక గ్రామ పంచాయతీ ఏకగ్రీవమైంది. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ప్రజలంతా ఎన్నికలు లేకుండా ఏకగ్రీవానికి నిర్ణయించారు. సర్పంచ్ పెనుబోతు నెల బాలుడు, ఉపసర్పంచ్గా కంతేటి వెంకట్రామరాజు ఎంపికయ్యారు. వీరితోపాటు ఎనిమిది వార్డులు కూడా ఏకగ్రీవమయ్యాయి. దీంతో ఉండి నియోజకవర్గంలో ఏకగ్రీవమైన తొలి పంచాయతీగా పాతాళ్లమెరక నిలిచింది.
ఆంధ్రప్రదేశ్
పాతాళ్లమెరక పంచాయతీ ఏకగ్రీవం


