హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి నుంచి అగ్రిగోల్డ్ బాండ్ల ధ్రువీకరణ

SDPT: ఉమ్మడి జిల్లాలోని అగ్రిగోల్డ్ డిపాజిటర్ల బాండ్ల ధ్రువీకరణ నేటి నుంచి మెదక్ ఎస్పీ కార్యాలయంలో ప్రారంభం కానుంది. నేటి నుంచి DEC 15 వరకు మెదక్, DEC 15 నుంచి JAN 23 వరకు సంగారెడ్డి, జనవరి 23 నుంచి ఫిబ్రవరి 10 వరకు సిద్దిపేట బాధితుల పత్రాలు పరిశీలిస్తారు. రోజుకు 250 మందిని అనుమతిస్తామని, కేటాయించిన తేదీల్లోనే ఆధారాలతో రావాలని ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు.