హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేబుల్ వైర్ దొంగతనం కేసులో ఇద్దరి రిమాండ్

SRD: పుల్కల్ మండలం చక్రియాల గ్రామంలో రైతు రోడ్లపాటి బేతాల్ వ్యవసాయ మోటార్ కేబుల్ వైర్‌ను దొంగిలించిన కేసును పోలీసులు ఛేదించారు. శివంపేటకు చెందిన శివకుమార్, సమీర్‌లను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.15 వేల నగదును రికవరీ చేసినట్లు ఇంఛార్జి ఎస్సై శ్రీహరి తెలిపారు. నిందితులను మంగళవారం రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.