HNK: పరకాల మండలం పైడిపెల్లిగ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్టు చేసినట్లు మంగళవారం రాత్రి పరకాల సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు పేకాట స్థావరంపై దాడులు నిర్వహించి ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకొన్నారు. వారి నుంచి రూ.10,500/- నగదు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
తెలంగాణ
ఏడుగురు పేకాట రాయులు అరెస్టు


