నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం 1075.10 అడుగులకు చేరింది. బుధవారం ఉదయం 6 గంటలకు 33.137 టీఎంసీల నీటినిల్వ నమోదైంది. గత 24 గంటల్లో ఇన్‌ఫ్లో లేకపోగా, 661 క్యూసెక్కుల నీటిని వివిధ అవసరాలకు విడుదల చేశారు. గత ఏడాది ఇదే సమయానికి 80.501 టీఎంసీల నీటినిల్వ ఉందని అధికారులు వెల్లడించారు.
తెలంగాణ
శ్రీరాంసాగర్‌లో 33.137 టీఎంసీల నీటినిల్వ


