WGL: సంగెం మండలం రేఖ్యానాయక్ తండా శివారులో గుడుంబా విక్రయిస్తున్న బానోత్ అనిల్‌ను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రూ.12 వేల విలువైన 30 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. గుడుంబా తయారీ కేంద్రంలో ఉన్న 1,000 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి, నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు.
తెలంగాణ
30 లీటర్ల గుడుంబా పట్టివేత..ఒకరిపై కేసు


