హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మట్టి తరలింపునకు అనుమతులివ్వొద్దు'

PDPL: ఎల్కలపల్లి నుంచి కన్నాల వరకు నిర్మిస్తున్న డబుల్ రోడ్డు పనుల కోసం రాణాపూర్ ఐకేపీ కేంద్రం సమీపంలోని సమ్మక్క గుట్ట నుంచి మట్టి తరలింపునకు అనుమతులు ఇవ్వొద్దని సర్పంచ్ స్రవంతి కోరారు. ఈ మేరకు తహశీల్దారుకు వినతిపత్రం అందజేశారు. మట్టి తరలింపునకు అనుమతులు మంజూరు చేయకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.