హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీర్ సీసాతో దాడి.. నిందితుడి అరెస్ట్

ADB: ఆదిలాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద మంగళవారం అతిక్ ఖురేషిపై బీర్ సీసాతో జరిగిన దాడి కేసులో వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ముస్తాఫా అలియాస్ షీన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడు అతిక్ ప్రస్తుతం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.