WGL: నెక్కొండ మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం పిచ్చికుక్క దాడిలో పలువురు గాయపడ్డారు. వారాంతపు సంతకు వచ్చిన ప్రజలపై కుక్క దాడి చేయడంతో భయాందోళనకు గురయ్యారు. మడిపల్లికి చెందిన ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా దాడి చేయడంతో కిందపడిపోయారు. రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వృద్ధుడిని తీవ్రంగా గాయపరచడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
తెలంగాణ
పిచ్చికుక్క దాడిలో పలువురికి గాయాలు


