ATP: తలారి రంగయ్యపై కళ్యాణదుర్గం కూటమి నేతలు చేస్తున్న ఆరోపణలను వైసీపీ నాయకులు ఖండించారు. ఎంపీ ల్యాడ్స్ నిబంధనల ప్రకారం ఎంపీ పనులను సిఫార్సు మాత్రమే చేస్తారని, నిధులు కలెక్టర్ ఆధ్వర్యంలో ఉంటాయని తెలిపారు. టెండర్లు, నిర్మాణం, బిల్లుల చెల్లింపుల్లో ఎంపీకి ప్రమేయం ఉండదన్నారు. అసత్య ప్రచారాలు మానుకోవాలని, ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సవాల్ విసిరారు.
ఆంధ్రప్రదేశ్
ఎంపీ ల్యాడ్స్ నిబంధనలు తెలుసుకోండి: వైసీపీ


