హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిప్యూటేషన్ పై సీడీఎంఏకు వెళ్లిన మధిర మున్సిపల్ కమిషనర్

KMM: మధిర మున్సిపల్ కమిషనర్ బెనటిక్ సామ్యూల్ పాల్ ఇరవై రోజుల పాటు డిప్యూటేషన్ పై హైదరాబాద్ లోని సీడీఎంఏ కార్యాలయానికి వెళ్లారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు డిసెంబర్ 9వ తేదీ వరకు ఆయన అక్కడ విధులు నిర్వర్తిస్తారు. ఈ క్రమంలో మధిర బాధ్యతలను ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్యకు అప్పగించారు. ఆయన మధిర మున్సిపల్ పరిపాలనా వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు.