హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

10 సర్పంచ్ స్థానాలకు 28 మంది పోటీ

KKD: గొల్లప్రోలు మండలంలోని 10 గ్రామ పంచాయతీలకు గాను AP మల్లవరం గ్రామంలో సర్పంచ్‌తో పాటు 10 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 9 గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలకు 28 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 122 వార్డు సభ్యుల స్థానాలకు గాను 15 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 97 స్థానాలకు 222 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.