హైదరాబాద్: 28°C
తెలంగాణ

పర్యాటక, ఆధ్యాత్మిక శోభతో సిద్దిపేట

SDPT: తెలంగాణలో వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాల్లో సిద్దిపేట ఒకటి. కొమురవెల్లి మల్లన్న ఆలయం, నాచారం లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాలతో ఈ జిల్లా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కోమటి చెరువు మినీ ట్యాంక్ బండ్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లతో పర్యాటక కేంద్రంగా అలరారుతోంది. సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక వసతులతో సిద్దిపేట ప్రగతి పథంలో దూసుకెళ్తోంది.