హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల వేళ సరిహద్దుల్లో ముమ్మర వాహన తనిఖీలు

అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో అక్రమ నగదు, మద్యం రవాణా అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. వాహనదారులు నగదు, వస్తువులకు సంబంధించిన బిల్లులు వెంట ఉంచుకోవాలని, తనిఖీలకు సహకరించాలని పోలీసులు సూచించారు.