హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధర్మపురిలో వైభవంగా గోదావరి హారతి

JGL: కార్తీక పౌర్ణమి సందర్భంగా ధర్మపురిలో నిర్వహించిన గోదావరి హారతి కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ముందుగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ బ్రహ్మపుష్కరిణిలో పంచసహస్ర దీపాలంకరణలో పాల్గొన్నారు. అనంతరం గోదావరి తీరంలో ప్రత్యేక పూజలు చేసి హారతి సమర్పించారు. భక్తులతో కలిసి దీపాలను నదిలో వదిలారు.