KNR: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని నగునూరు దుర్గాభవాని ఆలయంలో మంగళవారం రాత్రి జ్వాలాతోరణం వైభవంగా నిర్వహించారు. అర్చకులు ప్రత్యేక పూజల అనంతరం జ్వాలాతోరణాన్ని వెలిగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.
తెలంగాణ
నగునూరు దుర్గాభవాని ఆలయంలో జ్వాలాతోరణం


