హైదరాబాద్: 28°C
తెలంగాణ

అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి: శంకర్ దయాళ్

ఉమ్మడి జిల్లాలో అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని టీయూడబ్ల్యూజే మెదక్ జిల్లా అధ్యక్షులు శంకర్ దయాళ్ చారి డిమాండ్ చేశారు. రేగోడు, అల్లాదుర్గం, పెద్ద శంకరంపేట మండలాల్లో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సమస్యలపై నిరంతరం పోరాడుతామన్నారు. ఇందులో ఆనంద్, రాజకుమార్, విట్టల్ రావు,శంకర్, రఘుపతి, సంతోష్, లావణ్య పాల్గొన్నారు.