నల్గొండ బీట్ మార్కెట్‌లోని శ్రీ స్థూపకోటి దేవాలయంలో మంగళవారం రాత్రి జ్వాలాతోరణం వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారు, అమ్మవారు అర్ధనారీశ్వరుని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి దివ్యరూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల తాకిడితో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
తెలంగాణ
అర్ధనారీశ్వరుని రూపంలో అమ్మవారి దర్శనం!


