హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

MDK: నర్సాపూర్ 132 కేవీ సబ్-స్టేషన్ పరిధిలో అత్యవసర మరమ్మతులు, నిర్వహణ పనుల కారణంగా బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఇంఛార్జ్ ఏఈ రాకేష్ తెలిపారు. పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాలకు కరెంటు ఉండదన్నారు. వినియోగదారులు, రైతులు సహకరించాలని ఆయన కోరారు.