హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ రహదారిపై అక్రమ ఆక్రమణల తొలగింపు

SRPT: చివ్వెంల మండల పరిధిలోని సూర్యాపేట–ఖమ్మం జాతీయ రహదారి వెంట ఉన్న అక్రమ ఆక్రమణలను మంగళవారం నేషనల్ హైవే అధికారులు తొలగించారు. రహదారి పరిధిలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన నిర్మాణాలు, ఇతర ఆక్రమణల వల్ల వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. జాతీయ రహదారి నిబంధనలు పాటించాలని, ప్రయాణికుల భద్రతకు సహకరించాలని అధికారులు సూచించారు.