హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో రెండో విడతలో 2077 మంది పోటీ

CTR: జిల్లాలోని పది మండలాల పరిధిలో 253 సర్పంచ్‌లకు, 2282 వార్డు స్థానాలకు రెండో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఉపసంహరణలు, ఏకగ్రీవల అనంతరం పోటీదారుల జాబితాను అధికారులు విడుదల చేశారు. 80 సర్పంచి స్థానాలు, 1526 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 173 సర్పంచ్ స్థానాలకు 483 మంది, 748 వార్డు స్థానాలకు 1534 మంది బరిలో మిగిలారు. వీరికి గుర్తులు కేటాయించారు.