హైదరాబాద్: 28°C
తెలంగాణ

పొన్నారంలో ప్రత్యేక ఆధార్ క్యాంప్

MNCL: మందమర్రి మండలం పొన్నారం ప్రాథమిక పాఠశాలలో నేటి నుంచి 2 రోజుల పాటు ప్రత్యేక ఆధార్ కేంద్రాన్ని నిర్వహించనున్నట్లు సర్పంచ్ పెంచాల మధు తెలిపారు. ఈ ఆధార్ క్యాంపులో ఆధార్ కార్డులోని పేరు, పుట్టిన తేదీ, చిరునామా, మొబైల్ నంబర్ వంటి వివరాల్లో పొరపాట్లు ఉంటే సవరించుకునే అవకాశం ఉందని చెప్పారు. గ్రామస్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.