VSP: కొరియాలో ఈ నెల 16 నుంచి 22 వరకు జరిగిన విక్టర్ ఆసియా సీనియర్ బ్యాడ్మింటన్ పోటీల్లో విశాఖ నగరానికి చెందిన బీవీఎస్కే లింగేశ్వరరావు రజత పతకం సాధించారు. +35 నుంచి +75 విభాగాల్లో 14 దేశాలకు చెందిన 1,000 మంది తలపడ్డారు. +55 విభాగంలో లింగేశ్వరరావు మిక్స్డ్ డబుల్స్‌లో సుజన్నే వింగ్లిట్తో కలిసి భారత్ తరఫున రజతం గెలిచారు. క్రీడాకారులు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
ఆసియా బ్యాడ్మింటన్ పోటీలలో విశాఖ వాసికి రజితం


