ఆసిఫాబాద్ జిల్లా BSP అధ్యక్షుడిగా సాలం బిన్ హసన్ నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎబ్రామ్ శేఖర్ ఆయనకు నియామక పత్రం అందజేశారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తూ SC, ST, BC, మైనారిటీల హక్కుల కోసం కృషి చేస్తానని బిన్ హాసన్ తెలిపారు. సామాజిక న్యాయం, సమానత్వం, విద్య, వైద్యం, ఉపాధి సమస్యల పరిష్కారానికి పాటుపడతానని పేర్కొన్నారు.
తెలంగాణ
BSP జిల్లా అధ్యక్షుడిగా సాలం బిన్ హసన్ నియామకం


