హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు ఈనెల 30 తుది గడువు

ASR: చదువుకు దూరమైనవారు ఏపీ ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఇంటర్ చదివేందుకు ఈనెల 30లోగా ప్రవేశాలు పొందాలని అసిస్టెంట్ కమిషనర్ ఆర్.శశికుమార్ మంగళవారం పాడేరులో తెలిపారు. ఉద్యోగాలు, ఇతర పనులు చేసుకునేవారు సెలవు రోజుల్లో తరగతులకు హాజరవుతూ విద్య కొనసాగించవచ్చన్నారు. పదో తరగతికి 14ఏళ్లు, ఇంటర్‌కు 15ఏళ్లు నిండి ఉండాలి. ఇంటర్‌కు పదో తరగతి ఉత్తీర్ణత ఉండాలన్నారు.