హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాల పనులను అడ్డుకున్న గ్రామస్తులు

SRD: కంగ్టి గిరిజన గురుకుల పాఠశాల అదనపు భవన స్లాబ్ పనులను ఇసుకకు బదులు డస్ట్‌తో చేస్తుండటాన్ని సర్పంచ్ కృష్ణ, స్థానికులు మంగళవారం అడ్డుకున్నారు. నాణ్యత లోపిస్తే భవనం కూలిపోయే ప్రమాదముందని, మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సహకారంతో ధర్నా చేస్తామని హెచ్చరించారు. దీంతో ఇసుక ఉన్నంతవరకే పనులు చేసి మిగతావి నిలిపివేస్తామని కాంట్రాక్టర్ శ్రీహరి తెలిపారు.