హైదరాబాద్: 28°C
వార్తలు

రాప్తాడు బాధిత బాలికతో ఆస్పత్రిలో కేక్ కటింగ్

AP: ఉన్మాది హేమంత్ చేతిలో తీవ్రంగా గాయపడిన రాప్తాడు బాలిక క్రమంగా కోలుకుంటోంది. ఆమె చికిత్స పొందుతున్న ఆస్పత్రిలో సిబ్బంది బాలికతో నిన్న కేక్ కట్ చేయించారు. సంగీత కార్యక్రమం నిర్వహించారు. 'ఈ చిన్న పనులే పెద్ద మార్పును తెస్తాయి. బాలికలో ఉత్సాహం నింపేందుకు ఈ ప్రయత్నం చేసిన ఆస్పత్రి సిబ్బందికి ధన్యవాదాలు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా' అని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.