AP: ద్రోణి ప్రభావంతో రానున్న 4 రోజులు పిడుగులతో కూడిన తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. ఇవాళ మన్యం, అల్లూరి, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
వార్తలు
ALERT: నేడు ఈ జిల్లాల్లో వర్షాలు


