హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి నుంచి ఆగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల ధృవీకరణ

MBNR: ఉమ్మడి జిల్లాలోని ఆగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల ధృవీకరణ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఐదు జిల్లాల బాధితుల కోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసి 193 రోజుల షెడ్యూల్ ఖరారు చేశారు. రోజుకు గరిష్ఠంగా 250 మంది బాండ్లను పరిశీలిస్తారు. బాధితులు నిర్ణీత తేదీల్లో అసలు బాండ్లు, నగదు రసీదులతో హాజరుకావాలని ఎస్పీ సూచించారు.