హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సోమేశ్వర ఆలయంలో ఆకాశదీపం ఆవిష్కరణ

ఉమ్మడి జిల్లా సంగారెడ్డి పట్టణంలోని సోమేశ్వర వాడ శ్రీ సోమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మంగళవారం రాత్రి కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా సాగాయి. పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వాహకులు ఆలయ ఆవరణలో కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించారు. ఇదే వేళ ఆకాశదీపాన్ని ఆవిష్కరించడంతో ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వెలుగులతో విరాజిల్లింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.