ప్రధాని మోదీకి జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ ఫోన్ చేశారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై నేతలు చర్చించారు. భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, రక్షణ, టెక్నాలజీ రంగాల్లో సహకారంపై అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రపంచ శాంతి, అంతర్జాతీయ పరిణామాలపై సమీక్షించారు. 75 ఏళ్ల దౌత్య సంబంధాల నేపథ్యంలో భాగస్వామ్యాన్ని మరింత పెంచుకోవాలని నిర్ణయించారు.
వార్తలు
ప్రధాని మోదీకి జర్మనీ ఛాన్సలర్ ఫోన్


