హైదరాబాద్: 28°C
వార్తలు

11 లక్షల దీపాలతో మెరిసిపోయిన కాశీ

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవ్ దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. సుమారు 11 లక్షల మట్టి దీపాలతో 84 ఘాట్లు వెలుగులతో మెరిసిపోయాయి. ఈ వేడుకల్లో భాగంగా గంగా హారతి, 3D లేజర్ షో, డ్రోన్ షో ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరించాయి. ఈ అద్భుత దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.