హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండగట్టు అంజన్నకు యాదాద్రి పట్టువస్త్రాలు

JGL: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం నుంచి కొండగట్టు ఆంజనేయ స్వామివారికి పట్టువస్త్రాలను అక్కడి ఆలయ అధికారులు, అర్చకులు ఇవాళ తీసుకువచ్చారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం అధికారులు, అర్చకులు పట్టువస్త్రాలను పూర్ణకుంభంతో సాదరంగా స్వీకరించి, ప్రత్యేక పూజల అనంతరం స్వామివారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.