హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్తీక పౌర్ణమి రోజున విషాదం..!

SDPT: కార్తీక పౌర్ణమి రోజున జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కొండపాక మండలంలో వేరు వేరు గ్రామాల్లో విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి చెందారు. బందారం ఆలయంలో మైక్ పట్టుకున్న రాగుల దుర్గయ్య, దుద్దెడలో టెంటు ఇనుప పైపు బిగిస్తున్న అయ్యప్ప మాలధారి నాగరాజు షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలతో రెండు గ్రామాల్లో విషాదం అలుముకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.