హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఒక్కసారిగా కుండపోత వర్షం

KMM: వైరా మండలంలో భారీ వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి గన్నవరం, గోవిందాపురం, ఖానాపురం సహా చుట్టుపక్కల గ్రామాల్లో గత అరగంట నుంచి అతి భారీ వర్షం కురుస్తోంది. ఆకస్మిక కుండపోత వర్షంతో రహదారులు జలమయమవ్వగా, జనజీవనం స్తంభించిపోయింది. వర్షం కారణంగా రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.