హైదరాబాద్: 28°C
తెలంగాణ

సదాశివ ఆలయంలో కార్తీక దీపాల వెలుగులు

BHPL: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని సదాశివ ఆలయంలో మహిళా భక్తులు భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించారు. సోమవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపాల వెలుగులతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.