హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రేపు ట్రాఫిక్ మళ్లింపు'

HYD:  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో రేపు అంబర్‌పేట MCH గ్రౌండ్ నుంచి ముషీరాబాద్‌లోని కాశిష్ ఫంక్షన్ హాల్ వరకు 'హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్' పాదయాత్ర జరగనుంది. ఈ నేపథ్యంలో జాయింట్ సీపీ (ట్రాఫిక్) జోయల్ డేవిస్ కీలక ఆదేశాలు జారీ చేశారు. వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయనున్నట్లు తెలిపారు.