JN: మచ్చుపహాడ్ గ్రామంలో గత కొద్ది సంవత్సరాలుగా కోతులతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం గమనించిన సర్పంచ్ లింగాల హైమ రమేశ్, పాలకవర్గం గ్రామస్థుల సహకారంతో మంగళవారం దాదాపు 120 కోతులను పట్టించారు. మరో 2, 3 రోజుల్లో మిగతా వాటిని కూడా పట్టించి అడవిలో సురక్షితంగా వదిలిపెడతామని తెలిపారు. సహకరించిన గ్రామస్థులకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
కోతుల బెడద నుంచి మచ్చుపహాడ్కు విముక్తి!


