హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ నేతలకు పోలీసుల రాచమర్యాదలు: BRS

హనుమకొండ పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నాయకులకు పోలీసులు రాచమర్యాదలు చేస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా ప్రత్యేక గౌరవం ఇస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ కార్యకర్తలను మాత్రం అరెస్ట్ చేసి వేధిస్తున్నారని, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై సీపీ స్పందించాలన్నారు.