హైదరాబాద్: 28°C
తెలంగాణ

కానిస్టేబుళ్ల కుటుంబాలకు బీమా చెక్కుల పంపిణీ

SDPT: విధుల్లో ఉండగా రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందిన ముగ్గురు పోలీసు కానిస్టేబుళ్ల కుటుంబాలకు సిద్దిపేట సీపీ రష్మి పెరుమాళ్ రూ.5.10 లక్షల చొప్పున బీమా చెక్కులను అందజేశారు. వి. పరంధాములు, పి. వెంకటేశం, పి. నవీన్ కుమార్ కుటుంబాలకు ఈ పరిహారాన్ని పంపిణీ చేశారు. పోలీసు శాఖ ఎల్లప్పుడూ వారి కుటుంబాలకు అండగా ఉంటుందని సీపీ భరోసా ఇచ్చారు.