హైదరాబాద్: 28°C
తెలంగాణ

రిపబ్లిక్ డే క్యాంపునకు అల్ఫోర్స్ విద్యార్థిని ఎంపిక

KNR: కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ-టెక్నో పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని బి. లాస్య HYDలో జరిగే ప్రీ రిపబ్లిక్ డే పరేడ్‌కు ఎంపికైంది. నిజామాబాద్ గ్రూపు నుంచి 9 తెలంగాణ బెటాలియన్ తరఫున ఎంపికైన ఆమెను అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి అభినందించారు. శిక్షణ శిబిరాల్లో ప్రతిభ కనబరిస్తే జనవరి 26న గణతంత్ర వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపారు.