VKB: దౌల్తాబాద్-చంద్రవంచ రహదారిపై ఓ మలుపు ప్రమాదకరంగా మారింది. అక్కడ హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మలుపు వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాల నివారణకు రోడ్డుకు అడ్డుగా ఉన్న చెట్లను తొలగించి, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని వాహనదారులు అధికారులను కోరుతున్నారు.
తెలంగాణ
ప్రమాదాలకు నిలయంగా రహదారి మలుపు!


