హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏడుపాయల ఆలయంలో కార్తీక పౌర్ణమి శోభ

MDK: ఏడుపాయల వనదుర్గాభవాని ఆలయ ప్రాంగణంలో కార్తీక పౌర్ణమి శోభ సంతరించుకుంది. పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం ప్రత్యేక దీపోత్సవానికి నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు. అర్ధచంద్రుని ఆకృతిలో కొలువుదీరిన నీలకంఠుడి రూపంలో ప్రమిదలను అత్యంత సుందరంగా అమర్చారు. కార్తీక దీపాల కాంతుల్లో ఆలయ ఆవరణంతా ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతోంది.