KNR: కరీంనగర్ రాజరాజేశ్వరి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 42 మందికి ఉచిత కంటి ఆపరేషన్ల కోసం అర్హత కల్పించారు. ఈ కార్యక్రమానికి గురువారం 37 మంది హాజరయ్యారు. వీరిని ప్రత్యేక వాహనంలో రేకుర్తి కంటి ఆసుపత్రికి తరలించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు బండ కిషన్ రెడ్డి, మదర్ ఖాన్, గుండేటి రాంచందర్, కట్ల సత్యనారాయణమూర్తి, పెంటి మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఉచిత కంటి శిబిరానికి విశేష స్పందన


