BHPL: 52వ జూనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలకు చిట్యాల సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థిని నంగి సంజనశ్రీ ఎంపికైంది. పంజాబ్ రాష్ట్రంలో ఈ నెల 26 నుండి 29 వరకు జరగనున్న పోటీల్లో ఆమె పాల్గొననుంది. ఈ సందర్భంగా సంజనశ్రీని ఇంఛార్జ్ ప్రిన్సిపాల్ శ్రీజ, వైస్ ప్రిన్సిపాల్ మాలతీ లత, పీడీ వెన్నెల, పీఈటీ శారద, ఉపాధ్యాయ బృందం అభినందించారు.
తెలంగాణ
నేషనల్ కబడ్డీ పోటీలకు సంజనశ్రీ ఎంపిక


