హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెసిడెన్షియల్ స్కూల్ పనుల పరిశీలనలో ఎమ్మెల్యే

WGL: వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి క్రాస్ వద్ద నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, ఎలాంటి జాప్యం లేకుండా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.